calender_icon.png 23 September, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చక్కర ఫ్యాక్టరీ పునరుద్ధరణే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

23-09-2025 12:25:35 AM

మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

మెట్ పల్లి, సెప్టెంబర్ 22(విజయ క్రాంతి)జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట్ చక్కర ఫ్యాక్టరీ పునరుద్దరనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అ న్నారు. సోమవారం మెట్ పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావుతో కలసి విలేకరులసమావేశంలో ఆయన మాట్లాడారు.చక్కర ఫ్యాక్టరీకి సంబందించి బ్యాంకులలో ఉన్న బకాయిలు చెల్లింపుకు నూట డ్భె రెండు కోట్ల నిధులు ప్రభుత్వం తరపున మంజూరు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనం అని పేర్కొన్నారు.

చక్కర కర్మాగారం పున: ప్రారంభం, పసుపు బోర్డు ప్రారంభం రైతులకు సెంటిమెంట్ గా మా రాయని అన్నారు.రైతులు వరికి ప్రత్యామ్నాయంగా దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ రు తడి పంటలు అయిన మొక్కజొన్న, చెరు కు ఉత్పత్తిపై ఆధారపడ్డారని తెలిపారు. గతంలోసీఎం ఉన్న చంద్రబాబు నాయుడు పాల నలో చక్కర కర్మాగారంలో యాభై ఒక్కశాతం వాటా విక్రయించి, ప్రైవేటీకరణ చేశా రు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న చక్కర కర్మాగారం తెలంగాణ ప్రభుత్వ పరంగా నిర్వహించాలనే ఉద్యమించారని తెలిపారు. ప్రభుత్వపరంగా చక్కర కర్మాగారం నిర్వహించాలని రత్నాకర్రావు సబ్ కమిటీ కూడా నివేదిక అంద జేసింది అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చక్కర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సి ఉండగా, దాన్ని పూర్తిగా మూసివేశారని పేర్కొన్నారు.

దింతో రైతులు ప్రత్యామ్నయపంటగా మొ క్కజొన్న సాగుకు మళ్లారు అని తెలిపా రు.గతంలో పీసీసీ అధ్యక్షుడి హెూదాలో రే వంత్ రెడ్డి చక్కర కర్మాగారం సందర్శించి, పు న: ప్రారంభిస్తామని చెరకు రైతులకు హామీ ఇచ్చి,తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చ క్కర కర్మాగారం ఏర్పాటు చేస్తామని గవర్నర్ ప్రసంగంలోసైతం పేర్కొన్నారని అన్నారు. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టారు.

శ్రీధర్ బా బు ఆధ్వర్యంలో పునః ప్రారంభం పై విధివిధానాలపై కమిటీ వేశారని ఆ కమిటీలో నేను కూడా సభ్యుడిగా చక్కర కర్మాగారం సందర్శించి పరిశీలించడం జరిగిందన్నారు. మారి న కాలానికి అనుగుణంగా బోధన్ ప్రాం తంలో రైతులు పామాయిల్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రస్తు తం కూడా గాయత్రి చక్కర కర్మాగారంపై ఆధాపడి దాదాపు పదిహేను వందల హెక్టార్లలో చక్కర సాగు చేస్తున్నారు.

చక్కర సాగు లో ఒక్కసారి పెట్టుబడితో మూడేళ్లు దిగుబడి వస్తుంది.చక్కర కర్మాగారం పునః ప్రా రంభం కావాలంటే పదివేల ఎకరాల్లో చెరకు సాగు చేయాల్సి ఉంటుంది.ఫ్యాక్టరీ ప్రారంభిస్తామనే విశ్వాసం రైతుల్లో కల్పిస్తే, చక్కర సా గు చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభు త్వం సైతం వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ సైతం సరళీకృతం చేసింది.జగిత్యాల ప్రాంత రైతుల అభిప్రాయాలు,

మనోభావాలు తెలుసుకునేందుకు పరిశ్రమల శాఖ కార్యదర్శి తోపాటు వ్యవసాయ శాఖ కమిషనర్ రైతుల అభిప్రాయాలను సేకరించేందుకు ఈ నెల ఇరవై అరున వచ్చేందుకు సన్నాహాలు చేస్తు న్నాం. రైతాంగం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. పసుపు బోర్డు ఏర్పాటు పట్ల రైతులు రాజకీయాలకు అతీతంగా ఆలోచించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూ పతిరెడ్డి తన క్యాంపు కార్యాలయాన్ని పసుపు బోర్డు కార్యాలయానికి అందజేశారు.

గతం లో ఇరవై వేల ఎకరాల్లో చక్కర సాగు చేపట్టారు. ప్రస్తుతం కర్మాగారం పున: ప్రా రంభించేందుకు కనీసం పదివేల ఎకరాల సాగు చేపట్టాల్సిన అవసరం ఉంది.వరికి ప్ర త్యామ్నయంగా మొక్కజొన్న సాగుకు క్విం టాల్కు మద్దతు ధర రెండు వెల నాలుగు వందలు అందిస్తున్నాం. గతంలో మార్కెఫెడ్ ఆధ్వర్యంలోకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినం.

ఈ ఏడాది కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అక్టోబర్ అరు నుండి ప్రా రంభించాలని, సన్న రకాలకు ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో రైతులు అధికంగా సన్నరకాలు సాగు చేపట్టిన నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం ప్రా రంభించాలని కోరారు. 

చక్కర కర్మాగారం పునః ప్రారంభం జగిత్యాల జిల్లాకు ఒక వ రం లాంటిది అని అన్నారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మ హేందర్ రెడ్డి, సత్యనారాయణ, కిషాన్ సెల్ అధ్యక్షులు జలపతి రెడ్డి,ఆకుల లింగారెడ్డి, కొమతము రాజం,మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డితదితరులు పాల్గొన్నారు.