19-01-2026 07:22:55 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని భిక్కనూరు తహశీల్దార్ సునీత సూచించారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని, నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.