19-01-2026 07:25:39 PM
తూప్రాన్,(విజయ క్రాంతి): గత ఆరు నెలలుగా పులి తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి మల్కాపూర్ మద్య మార్గములలో సంచరిస్తున్నదన్న భయాందోళనలో గ్రామస్తులు ఉండగా తిరిగి సోమవారం ఒక చిరుత గుండ్రెడ్డిపల్లి నుండి మల్కాపూర్ కు వెళ్లే మార్గ మధ్యలోని అడవి ప్రాంతములోని ఒక పెద్ద గుండు పైన పడుకొని చూస్తున్న పులిని దారి గుండా వెలుతున్న ప్రయాణికులు వీక్షించి గ్రామస్తులకు సమాచారం అందించారు. పులులు పదేపదే అడవి ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వెలిబుచ్చారు.
అడవి ప్రాంతంలో పంట పొలాలు ఉన్న రైతులు పూర్తిగా పంట పొలాల వద్దకు వెళ్లే ప్రయత్నం చేయడంలేదు, పశువుల కాపరులు తమ మందలను అడవిలోకి మేతకు తీసుకుపోవడం మానేశారు. అంతేకాకుండా ప్రయాణికులు సైతం తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటు ప్రయాణాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు పులులను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరిచారు. ఫారెస్ట్ అధికారులు కాపుకాసి సంచరిస్తున్న పులులను పట్టుకునే ప్రయత్నం చేసి అదుపులోకి తీసుకోవాలని గ్రామస్తులు తెలిపారు.