10-05-2025 09:37:00 AM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): మున్సిపల్ పరిధి రహదారులపై పశువులు యథేచ్ఛగా సంచరించటం వల్ల అటు పాదాచారులు, ఇటు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, పశువులపై వాటి యజమానులు బాధ్యత వహించాలని లేని ఎడల గోశాలకు తరలిస్తామని పుర కమిషనర్ రాజు, పట్టణ ఎస్సై రాజశేఖర్ హెచ్చరించారు. శుక్రవారం పుర అధికారులు, పోలీసులు సంయుక్తంగా తెలిపారు. యజమానులు తమ పశువులను రోడ్లపై వదిలేయడంతో కలిగే వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నాయని, వీటిల్లో కొన్ని వాహనాల శబ్దానికి బిత్తరపోయి మిగత వాహనాలపై పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని నిత్యం ప్రజలు పురపాలక అధికారులకు, పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రాత్రి పూట డ్యూటీకి వెల్లే కార్మికులు పశువుల వల్ల ప్రమాదాల బారిన పడుతున్నట్లు తెలిపారు. పశువుల యజమానులకు రెండు రోజల గడువు ఇస్తున్నామని ఒకవేళ రోడ్లపై పశువులు సంచరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబో మని తప్పకుండా పశువులను గోశాలలకు తరలిస్తామని స్పష్టం చేశారు.