calender_icon.png 10 May, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్వేయన్స్ డ్రైవర్లకు సిఎంపిఎఫ్, పర్మినెంట్ నెంబర్లు ఇప్పించాలి

10-05-2025 11:54:21 AM

  1. ఆర్జీ-1జీఎం కు వినతి పత్రంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (ఎస్.సి.కె.యస్) ఏరియా అధ్యక్షులు ఇండ్ల ఓదెలు 

గోదావరిఖని,(విజయక్రాంతి): కన్వేయన్స్ డ్రైవర్లకు సిఎంపిఎఫ్, పాస్ పుస్తకాలు, ఫాం వై,వై (వి.వి స్టేట్మెంట్) పర్మినెంట్ ఇప్పించాలని ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్  కు వినతి పత్రంలో ఏరియా అధ్యక్షులు ఇండ్ల ఓదెలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (ఎస్.సి.కె.యస్) సింగరేణిలో కొన్నికన్వేయన్స్ వాహనాలకు గత 2, 3 సంవత్సరాలుగా డ్రైవర్ల వేతనాల నుండి సిఎంపిఎఫ్  పెన్షన్ డబ్బులను కట్ చేస్తున్నారని. వాటికి సంబంధించిన వివరాలను పాస్ పుస్తకాలను నేటికి డ్రైవర్లకు ఇవ్వలేదని ఓదెలు అవేదన వ్యక్తం చేశారు.

డబ్బులను ప్రతి సంవత్సరం సిఎంపిఎఫ్ కార్యాలయానికి పంపించాలని, కానీ నేటి వరకు సిఎంపిఎఫ్ వివరాలను వి. వి స్టేట్మెంట్లను డబ్బులను పంపలేదన్నారు. కార్మికులు సిఎంపిఎఫ్ కార్యాలయంలో విచారణ చేయగా అక్కడ వారి వివరాలు లేవని అధికారులు చెపుతున్నారని, దీంతో డ్రైవర్లలో తమ డబ్బులపై అనుమానాలు వస్తున్నాయన్నారు. మిగతా డ్రైవర్లకు 1.04.2024 తేదీ నుంచి సిఎంపిఎఫ్ అమలు అవుతున్నదని, కానీ నేటికి వారికి పర్మినెంట్ సిఎంపిఎఫ్ నెంబర్లు కెటాయించలేదన్నారు. వెంటనే మీరు జోక్యంచేసుకొని తక్షణం గత 2, 3 సంవత్సరాలుగా సిఎంపిఎఫ్ కట్ అవుతున్న వారికి సిఎంపిఎఫ్ పాస్ పుస్తకాలు, ఫాం- వై.వై (వి.వి స్టేట్ మెంట్)  1,04, 2024 నుండి అమలు అవుతున్న వారికి పర్మినెంట్ సిఎంపిఎఫ్ నెంబర్లు ఇప్పించాలని జీఎంని కోరారు. స్పందించిన జీఎం త్వరలోనే మీ సమస్యకు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఓదెలు తెలిపారు.