calender_icon.png 10 May, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్ కి వెన్నులో వణుకు పుట్టేల కేంద్రం చర్యలు తీసుకోవాలి

10-05-2025 09:12:32 AM

మంథనిలో సైన్యానికి సంఘీభావ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు 

మంథని,(విజయక్రాంతి): పాకిస్థాన్ కి వెన్నులో వణుకు పుట్టే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని మంథనిలో భారత సైన్యానికి సంఘీభావ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు(Duddilla srinubabu) అన్నారు. ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా  శుక్రవారం రాత్రి మంథని పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి శ్రీపాద చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న  దుద్దిళ్ల  శ్రీను బాబు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా గాంధీ చౌక్ నుండి పూలే చౌరస్తా వరకు జాతీయ జెండాలను పట్టుకొని పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీనీ నిర్వహించారు. 

అనంతరం శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ... పహల్గాంలో అమాయక భారతీయులను పాకిస్తాన్ తీవ్రవాదులు కాల్చి చంపిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వనికి రాజకీయాలకు అతీతంగా దేశంలోని 140 కోట్ల మందిమి  అండగా ఉంటామన్నారు.  దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వనికి మనమందరం అండగా ఉందామన్నారు. సైన్యం ఎటువంటి చర్యలు తీసుకున్న దానికి మా మద్దతు ప్రకటిస్తామని, దేశం వైపు కన్నెత్తి చూడటానికే పాకిస్తాన్ భయపడాలని శ్రీను బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్,  యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రూ రమాదేవి, సీనియర్ అడ్వకేట్ రఘోత్తం రెడ్డి, నాయకులు కుడుదుల వెంకన్న, వొడ్నాల శ్రీనివాస్, దిగంబర్, మాజీ కౌన్సిలర్లు, మంథని పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు.