calender_icon.png 14 August, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీని మించి అమ్మితే చర్యలు తప్పవు

14-08-2025 01:28:49 AM

డీసీఎంఎస్ మన గ్రోమోర్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్ టౌన్ ఆగస్టు 13 : యూరియా కొరత సృష్టించి ఎమ్మార్పీని మించి అ మ్మితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డి.సి.ఎం.ఎస్, మన గ్రోమోర్ సెంటర్ లను బుధవారం కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు.రిజిస్టర్లను తనిఖీ చేసి, యూరియా లభ్యత, పంపిణీ విధానాన్ని పరి శీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా అందరి రైతులకు అందేటట్లు చూడాలని ఎమ్మార్పీ ని మించి అమ్మిన వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. అలాగే వారు అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేష్, మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాసులు పాల్గొన్నారు.