calender_icon.png 14 August, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీం తీర్పు బీజేపీ, కాంగ్రెస్‌కు చెంపపెట్టు

14-08-2025 01:28:32 AM

- బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి

- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాం తి): గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రొ. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ రెండు ఢిల్లీ పార్టీలు రా జ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని మండిపడ్డారు. బడుగు, బలహీనవర్గాలైన దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ చేసిన సిఫారసును పట్టించుకోకుండా ప్రజాస్వామ్యబ ద్దంగా ఎన్నికైన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ చులకన చేశారని విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.

కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. తమ ప్రభు త్వ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి తన బీసీ వ్యతిరేక వైఖరిని రేవంత్ రెడ్డి చాటుకున్నారని మండిపడ్డారు. అయితే బీజేపీ, కాంగ్రెస్‌ల చర్యలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. దీంతో పాటే బీజేపీ, కాంగ్రెస్  ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైందన్నారు.

 న్యాయవ్యవస్థకు సలాం చేస్తున్నాం..

బీఆర్‌ఎస్ నామినేట్ చేసిన బలహీనవర్గా ల అభ్యర్థులకు అడ్డుతగిలి, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించిన బీజేపీ, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని కేటీఆర్ విమర్శించారు. అధికారం కోసం ప్రజా స్వామ్య విలువలను, రాజ్యాంగ వ్యవస్థలను తుంగలో తొక్కిన ఈ పార్టీల అప్రజాస్వామిక విధానాలు ఎంతమాత్రం సాగనివ్వబోమని సు ప్రీంకోర్టు తన తీర్పుతో చాటిచెప్పిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడిన గౌరవ న్యాయవ్యవస్థకు బీఆర్‌ఎస్ పక్షాన శిరస్సు వంచి సలాం చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.  

గవర్నర్ అన్యాయంగా రద్దు చేశారు: ఎమ్మెల్సీ దాసోజు 

సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. “బీఆర్‌ఎస్  ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను గవర్నర్ అన్యాయంగా గతంలో రద్దు చేశారు. దాన్ని హైకోర్టు కొట్టివేసింది. మాకు అనుకూలంగానే తీర్పు వచ్చినప్పటికీ గవర్నర్ అమలు చేయకపోవడంతో మేము సుప్రీం కోర్టును ఆశ్రయించాము. మాకు పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నప్పుడు కోదండరామ్, అమీర్ అలీఖాన్‌కు కూడా ఉన్నాయి కదా.

రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తించాలి. గవర్నర్ రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. స్పెషల్ అచీవ్‌మెంట్ లేదు, రాజకీయ సంబంధాలున్నాయని గవర్నర్ అన్నారు. మరీ వాళ్లకు కూడా ఉన్నాయి కదా. నాడు పదవులేవీ నింపమని ప్రకటించి రాత్రికి రాత్రి ఏ కారణంచేతనో వారిని నామినేట్ చేశారు. ధర్మం గెలవాలి. రాహుల్ గాంధీ అన్నట్లుగా భారత సంవిధాన్ కాపాడబడాలి. వారి నియామకానికి సంబంధించిన గెజిట్‌ను హైకోర్టు రద్దు చేసింది.

అయినా గెజిట్‌ను పట్టుకొని ఎమ్మెల్సీలుగా వారు ప్రమాణం చేశారు. రేవంత్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదు. రేవంత్ రూల్ బుక్ నడుస్తోంది. 2024 ఆగస్టు 14న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను ఈ రోజు మోడిఫై చేసింది. కాబట్టి ధర్మం గెలిచినట్లుగా భావిస్తున్నాము, అయినా ఈ విషయం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఆర్డర్ కాపీ చూసి మరోసారి దీనిపై స్పందిస్తాను” అని అన్నారు.