1 July, 2026 | 4:11 AM

పాఠశాలలో పంచాయితీలు నిర్వహిస్తే చర్యలు

18-10-2024 02:29 AM

మంథని ఎస్సై  రమేష్

మంథని, అక్టోబర్17: పాఠశాల అంటేనే ఎంతో పవిత్రమైనదని అ టువంటి పాఠశాలలో  పంచాయతీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్ప వని మంథని ఎస్సై రమేష్ హెచ్చరించారు. గురువారం మంథని పట్ట ణంలోని ప్రభుత్వ(బాలుర) పాఠశాలలో పంచాయితీలు నిర్వహిస్తు న్నారని తెలుసుకున్న ఎస్సై అక్కడికి చేరుకొని అక్కడ పంచాయితీ నిర్వహిస్తున్న పెద్దమనుషులకు కౌన్సిలిం గ్ ఇచ్చారు. ఇకపై ఎవరైనా పాఠశాలలో పంచాయితీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.