13-02-2025 12:00:00 AM
ఒకే రోజు రూ. 2.05 లక్షలు వసూలు చేసిన మున్సిపల్ అధికారులు
గజ్వేల్, ఫిబ్రవరి 12 : మున్సిపల్ అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, వ్యాపారం నిర్వహించేవారు మున్సిపల్ నుండి ట్రేడ్ లైసెన్స్ తప్పకుండా తీసుకోవాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య వ్యాపారులను హెచ్చరించారు.
బుధవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని మొండి బకాయిలను వ్యాపార సంస్థల నుండి ఆయన సిబ్బందితో కలిసి వసూలు చేశారు. ఓకే రోజు రెండు లక్షల 5వేల రూపాయల పెండింగ్ బకాయిలను వసూలు చేశారు. పట్టణ ప్రజలు, వ్యాపారులు సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. ఆయన వెంట ఆర్ ఐ భరద్వాజ, సిబ్బంది పాల్గొన్నారు.