calender_icon.png 16 August, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షూటింగ్ చేస్తే చర్యలు తప్పవ్

09-08-2025 12:00:00 AM

టాలీవుడ్‌లో సినీకార్మికుల వేతనాల పెంపు అంశం ఇంకా కొలిక్కి రాలేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్-నిర్మాతల చర్చలు కొనసాగు తున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నిర్మాతల మండలికి కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎలాంటి షూటింగులు జరపవద్దని ఛాంబర్ వెల్లడించింది. ‘స్టూడియోలు, ఔట్ డోర్ యూనిట్లు అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించవద్దు.

ఈ ఆదేశాలను నిర్మాతలు, స్టూడియో యజమానులు తీవ్రంగా పరిగణించాలి. తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల యూనియన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పువు. చర్చలు, సంప్రదింపులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలి. తదుపరి సూచనలు ఇచ్చేవరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి” అని స్పష్టం చేసింది.