calender_icon.png 16 August, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినోదం పంచే చాయ్‌వాలా

09-08-2025 12:00:00 AM

ఎప్పుడూ విభిన్న కథలతో ప్రయోగాలు చేస్తుంటారు యువ నటుడు శివ కందుకూరి. ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు వీలున్న కథల్ని మాత్రమే ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న ఆయన కథానాయకుడిగా రూపుదిద్దుకున్న తాజాచిత్రం ‘నచాయ్ వాలా’. ఈ చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్ పాపుడిప్పు నిర్మిస్తున్నారు.

ప్రమోద్ హర్ష రచనాదర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ శుక్రవారం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఇందులో శివ కందుకూరి, రాజీవ్ కనకాల స్కూటీపై జాలీగా తిరుగుతున్నట్టు కనిపిస్తున్నారు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ప్రేమ, వారసత్వం అంశాల చుట్టూ తిరుగుతుందని టీమ్ తెలిపింది. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తుండగా, క్రాంతి వర్ల సినిమాటోగ్రాఫర్‌గా, పవన్ నర్వా ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.