calender_icon.png 14 August, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంతార ప్రీక్వెల్‌లో కనకావతిగా..

09-08-2025 12:00:00 AM

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి రచనాదర్శకత్వంలో 2022 సంవత్సరంలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం ‘కాంతార’. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘కాంతార: చాప్టర్1’ పేరుతో హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇదివరకు మేకర్స్.. కథానాయకుడు రిషబ్ శెట్టి పుట్టినరోజున అతని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియో కూడా హ్యుజ్‌బజ్‌ను క్రియేట్ చేసింది. తాజాగా శుక్రవారం వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి కథానాయిక రుక్ష్మిణి వసంత్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆమెను ‘కనకావతి’గా పరిచయం చేస్తూ లాంచ్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇదే ఏడాది అక్టోబర్ 2న కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీ అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా, అర్వింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.