12 March, 2026 | 6:50 AM

ప్రజల భాగస్వామ్యంతోనే కార్యాచరణ

12-03-2026 12:00 AM

చేవెళ్ళ మార్చి 11(విజయక్రాంతి): ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజా పాలన ప్రగతి కార్యచరణ సాధ్యమవుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా పాలన-ప్రగతి కార్యాచరణ ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం మున్సిపల్ పరిధిలోని 8, 9,10వ వార్డుల్లో ప్రత్యేక కార్యాచరణ నిర్వహించారు.

8వార్డు కౌన్సిలర్ దావల్గారి గోపాల్ రెడ్డి, 9వ వార్డు కౌసిలర్ తాళ్లపల్లి నర్సిములు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశం, మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతవెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ కాసుల రాముగౌడ్, కౌన్సిలర్లు బండారి శైలజాఆగిరెడ్డి, నాయకులు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతవెంకట్ రెడ్డి మాట్లాడుతూ... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

వీధులల్లో  చెత్త వేయకూడదని  చెత్త పోగేసి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలన్నారు. వార్డు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 99 ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ బేగరి రాములు, మాజీ సర్పంచులు రెడ్డిశెట్టి మధుసూదన్ గుప్త, మల్లిపెద్ది వెంకటేశం గుప్త, పడాల ప్రభాకర్, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్ ఎర్ర గోపాల్ వార్డు ప్రజలు పాల్గొన్నారు.