calender_icon.png 9 December, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటుడు దిలీప్ నిర్దోషి

09-12-2025 02:22:59 AM

  1. మలళయాల నటి కిడ్నాప్, లైంగికదాడి ఆరోపణలు

మరో ఆరుగురు దోషులు కేరళ ఎర్నాకుళం కోర్టు తీర్పు

త్రివేంద్రం, డిసెంబర్ 8: మలయాలళ నటి కిడ్నాప్, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన కేసు ఎనిమిదేళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించింది. ఏళ్లుగా విచారణ జరుగుతోన్న ఈ కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్‌ను కేరళలోని ఎర్నాకుళం కోర్టు సోమవారం నిర్దోషిగా తేల్చింది. అత్యాచారం, కుట్ర వంటి నేరాల కింద ఆరుగురిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది.

మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించిన ప్రముఖ నటి 2017, ఫిబ్రవరి 17న కిడ్నాప్‌నకు గురయ్యారు. ఆ రోజు రాత్రి రెండు గంటల పాటు ఆమెను తన కారులోనే లైంగిక వేధింపులకు గురిచేసిన దుండగులు.. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. కొచ్చిలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో దిలీప్ కూడా ఒకరు. వారిపై కిడ్నాప్, లైంగిక వేధింపులు, గ్యాంగ్‌రేప్, ఉద్దేశపూర్వకంగా ఆధారాలను చెరిపివేయడం వంటి అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో 2017లో తొలి ఛార్జిషీట్ నమోదైంది. అదే ఏడాది జులైలో దిలీప్ అరెస్టయ్యాడు.

నాలుగు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. కేరళ పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించిన దిలీప్.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. అయితే ఆ అభ్యర్థన తిరష్కరణకు గురైంది. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయమూ లేదని చెప్తూ వచ్చిన దిలీప్.. తాజా తీర్పుపై స్పందించారు. ‘ఇది నాపై జరిగిన కుట్ర. నాకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు’ అని మీడియాతో మాట్లాడారు.