calender_icon.png 9 December, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సిద్ధుకు సుప్రీం నోటీసులు

09-12-2025 02:20:15 AM

హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన పిటిషనర్

బెంగళూరు, డిసెంబర్8: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 2023లో వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కే శంకర అనే వ్యక్తి అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనికి సమాధానం ఇవ్వాలని సీఎంను కోర్టు ఆదేశించింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధన ప్రకారం..

సిద్ధరామయ్య అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని, వరుణ అసెంబ్లీ నుంచి ఆయ న ఎన్నిక చెల్లదని ప్రకటించాలని పిటిషనర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. హై కోర్టు ఉత్తర్వులను పిటిషనర్ సుప్రీంలో సవాల్ చేయగా ధర్మాసనం నోటీసులు జారీ చేసిం ది. ఒకవైపు కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు తీవ్రస్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి. సిద్ధు స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం అవుతారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.