11 August, 2026 | 8:49 AM

27న రండి

26-05-2024 12:39 AM

నటి హేమకు పోలీసుల సమన్లు

బెంగళూరు, మే 25: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి పోలీసులు సమప్లు జారీ చేశారు. నటి హేమ, ఆషురాయ్, జీఆర్ ఫాంహౌజ్ ఓనర్ గోపాల్ రెడ్డి  సహా 86 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న (సోమవారం) విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా, రేవ్ పార్టీకి సంబంధించి ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ కారు స్టిక్కర్‌ను ఎవరు వాడారనే దానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఈ నేప థ్యంలోనే పూర్ణారెడ్డి అనే వ్యక్తి ఆయన స్టిక్కర్ వాడినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోలీసులు సోదాలు జరిపిన సమయంలో పూర్ణారెడ్డి పరారైనట్టు గుర్తించారు. అయితే శనివారం పూర్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసింది. మరోవైపు రేవ్ పార్టీలో చిత్తూరు మూలాలను బెంగళూరు పోలీసులు ఆరాతీస్తున్నారు. చిత్తూరు జిల్లా కు చెందిన రణధీర్, అరుణ్‌కుమార్ కీలకంగా వ్యవహరించడంతో వారి వివరాలను సేకరిస్తున్నారు. వారిని ఏ2, ఏ4లుగా ఎఫ్‌ఐఆర్‌లో  పొందుపరిచారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.