calender_icon.png 27 December, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టండి

27-12-2025 01:53:55 AM

రుక్మిణి వసంత్.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవల ‘కాంతార: చాప్టర్ 1’తో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’లో నటిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. యష్ ‘టాక్సిక్’లోనూ రుక్మిణి కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.

రుక్మిణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడంతో సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. “ఇప్పుడు నేను ‘డ్రాగన్’లో నటిస్తున్నా. ఈ సినిమా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన ప్రాజెక్టు. ఎన్టీఆర్‌లాంటి పవర్‌ఫుల్ స్టార్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా గర్వంగా, ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ప్రేక్షకులు నన్ను కొత్త కోణంలో చూస్తారని ఆశిస్తున్నా.

ఇంతకుమించి నా ఇతర సినిమాల వివరాలు చెప్పలేను. ముఖ్యంగా ‘టాక్సిక్’ సినిమా అప్‌డేట్స్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. కానీ, సరైన సమయం వచ్చినప్పుడు మేకర్స్ అధికారికంగా అన్ని విషయాలు తెలియజేస్తారు. అప్పటివరకు కొంచెం ఓపిక పట్టండి. నా రాబోయే సినిమాల గురించి కూడా పూర్తి వివరాలతో నేను మీ ముందుకు వస్తాను. ప్రేక్షకుల ప్రేమ, మద్దతే నాకు అదిపెద్ద బలం” అని తెలిపింది.