17 April, 2026 | 4:05 PM

నటి కల్పికపై పబ్ నిర్వాహకుల దాడి

01-06-2025 12:12 AM

కేక్ విషయంలో ఘర్షణ

శేరిలింగంపల్లి, మే 31: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ వివాదంలో పడ్డారు. ఓ పబ్‌లో ఆర్డర్ చేసిన కేక్ విషయంలో పబ్ నిర్వాహకులకు ఆమెకు మధ్య జరిగిన గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. కల్పిక శుక్రవారం సాయం త్రం హైదరాబాద్ గచ్చిబౌలి విప్రో సర్కిల్‌లో గల ప్రిజం పబ్‌కు స్నేహితులతో కలిసి వెళ్లింది.

అక్కడ కేక్ విషయంలో కల్పికకు, పబ్ నిర్వాహకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాట మాట పెరగడంతో నిర్వాహకులు కల్పికపై దాడికి దిగారని తెలుస్తున్నది. పబ్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని కల్పిక ఆరోపించారు.  అయితే కల్పిక డ్రగ్గిస్ట్ అని పబ్ నిర్వాహకులు ఆరోపించడం దుమారం రేపుతుంది.