4 July, 2026 | 11:11 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

విశ్వవద నాయక..

02-06-2025 01:01 AM

అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న తాజాచిత్రం ‘థగ్‌లైఫ్’. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శింబు, త్రిష, అభిరామి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 1987లో ‘నాయకన్’తో హిట్ అందుకున్న కమల్-మణిరత్నం కాంబోలో సుదీర్ఘ కాలం తర్వాత వస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందీ మూవీ. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ‘విశ్వవద నాయక..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో అలెగ్జాండ్రా జాయ్ ఆలపించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు.