14 July, 2026 | 6:06 AM

అదానీ టోటల్ గ్యాస్ లాభం 71% వృద్ధి

01-05-2024 12:30 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: అదానీ గ్రూప్ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ నికరలాభం మార్చి త్రైమాసికంలో 71 శాతం వృద్ధిచెంది రూ. 168 కోట్లకు చేరింది. గత ఏడాది క్యూ4లో ఇది రూ.98 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 1,197 కోట్ల నుంచి రూ.1,258 కోట్లకు చేరింది. మంగళవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.0.25 చొప్పున డివిడెండును సిఫార్సుచేసింది.  డివిడెండ్ చెల్లింపు నకు జూన్ 14 రికార్డు తేదీగా కంపెనీ ప్రకటించింది.