14 July, 2026 | 4:30 AM

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌కు రూ.835 కోట్ల జీఎస్టీ పెనాల్టీ నోటీసు

01-05-2024 12:32 AM

ముంబై, ఏప్రిల్ 30: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌కు రూ.835 కోట్ల జీఎస్టీ పెనాల్టీ నోటీసు జారీ అయ్యింది. 2019 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ, పెనాల్టీలతో సహా రూ.835 కోట్లు చెల్లించాలంటూ మహారాష్ట్ర పన్నుల శాఖ పెనాల్టీ ఆర్డర్ జారీచేసినట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ మంగళవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. తాము క్లెయిం చేసిన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)కు సంబంధించి జీఎస్టీ చట్ట ప్రకారం కొన్ని ఉల్లంఘనలు జరిగాయని, స్థిరాస్తుల విక్రయంపై పన్ను చెల్లించలేదని, జీఎస్టీ చెల్లింపుపై వడ్డీ కట్టలేదన్న ఆరోపణలతో ఈ ఆర్డర్ జారీ అయ్యింది. కంపెనీ ఎక్సేంజీలకు సమర్పించిన సమాచారం ప్రకారం ఈ ఆర్డర్‌లో జీఎస్టీ బకాయి రూ.380 కోట్లుకాగా, రూ.416 కోట్ల పెనాల్టీ, రూ.38 కోట్ల వడ్డీ ఉన్నది.