14 July, 2026 | 7:21 AM

క్యాష్ ఈజ్ కింగ్

30-04-2024 12:05 AM

పెరుగుతున్న ఏటీఎం నగదు విత్‌డ్రాయిల్స్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: దేశంలో యూపీఐ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ, చేతి స్పర్శతో చూసుకునే నగదు పట్ల మక్కువ తగ్గకపోగా అధికమవుతున్నది. 2023 ఆర్థిక సంవత్సంరలో ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయిల్స్ సగటున నెలకు 5.51 శాతం పెరిగాయి. 2022  నెలకు సగటు నగదు విత్‌డ్రాయిల్స్ రూ.1.35 కోట్ల నుంచి రూ.1.43 కోట్లకు చేరినట్టు తాజాగా విడుదలైన సీఎంఎస్ కన్జంప్షన్ నివేదిక వెల్లడించింది. అటు యూపీఐ చెల్లింపులతో పాటు ఇటు ఏటీఎం నగదు ఉపసంహరణలు పెరగడం దేశంలో ప్రజలు వస్తు, సేవల కోసం మరింత ఖర్చు చేస్తున్నారనడానికి నిదర్శనం. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 12కు 10 నెలల్లో 2023 ఆర్థిక సంవత్సరం నెలవారీ సగటుకంటే 7.23 శాతం అధికంగా ఏటీఎంల నుంచి నగదును తీసుకున్నారు. మెట్రో నగరాల్లో సగటు క్యాష్ విత్‌డ్రాయిల్స్ 10.37 శాతం పెరగ్గా, సెమి మెట్రోల్లో 3.73 శాతం, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 3.94 శాతం చొప్పున విత్‌డ్రాయిల్స్ పెరిగాయి.  ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు చెందిన ఏటీఎంలు మెట్రోపాలిటిన్, పట్టణ ప్రాంతాల్లోని ఏటీఎంల్లో 49 శాతం, చిన్న పట్టణాలు, గ్రామాల్లో 51 శాతం చొప్పున ఉన్నాయి. ప్రైవేటు రంగ బ్యాంక్ ఏటీఎంలు 64 శాతం మెట్రోపాలిటిన్, ఇతర నగర, పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 36 శాతం చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉన్నాయి.