విలేఖరి పుల్ల రవితేజపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
దళిత బహుజన సంఘాల డిమాండ్
గణపురం,ఆగస్టు 19 (విజయ క్రాంతి): విలేఖరి పుల్ల రవితేజపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత బహుజన సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన మండల అధ్యక్షులు ‘శనిగరపు రాజేందర్ ‘గ్రామ కమిటీ అధ్యక్షుడు తిక్క సంపత్ ‘ ఆధ్వర్యంలో చిట్యాల ఆర్ బి న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి పుల్ల రవితేజ పై దాడి చేసిన నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పుల్ల రవితేజ పై ఆదివారం రాత్రి ఇంట్లో చోరబడి దాడి చేసిన నిందితులను సంబంధించిన అధికారులు గుర్తించి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు.
ఈ సంఘటనపై సంబంధించిన అధికారులు డి.ఎస్.పి తక్షణమే సమగ్ర విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు పసునూటి శంకర్ అంబేద్కర్ సంఘం మండల నాయకులు దూడపాక శ్రీనివాస్ చిలువేరు ఉదయాకర్ ఆలూరు మొగిలి కుక్క ముడి బాబు మైనార్టీ మండల నాయకులు ఎండి సైదులు పాషా గడ్డమీద సాంబయ్య గౌడ్ మాదాసు లక్ష్మణ్ గౌడ్ లుపాల్గొన్నారు.






