06-12-2025 08:03:54 PM
కరీంనగర్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాoను శనివారం అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్, ఆర్డిఓ కే.మహేశ్వర్ రాజకీయ పార్టీ ప్రతినిధిలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదరపు కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవిఎం, వివిప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు.
ఈవిఎంల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈవిఎం గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, సత్తినేని శ్రీనివాస్, నాoపల్లి శ్రీనివాస్, మిల్కురి వాసుదేవ రెడ్డి, బర్కత్ ఆలీ, సిరిసిల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.