calender_icon.png 6 December, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

06-12-2025 08:05:31 PM

మణుగూరు (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 70వ వర్ధంతి వేడుకలను శనివారం మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని విగ్రహానికి మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచాన కార్యదర్శి సిద్దెల తిరుమలరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను కొనియాడారు. సమానత్వం, న్యాయం, హక్కుల కోసం అంబేద్కర్ చూపిన మార్గం నేటికీ ప్రతీ భారతీయుడికి ప్రేరణఅని, ఆయన ఆలోచనలు యువతలో మరింతగా వ్యాప్తి చెందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు ఇసుంపల్లి నాగేశ్వరావు, గుగ్గిల నరసింహారావు, గడ్డం రాంప్రసాద్, జి మధు, ఎస్ సుభాష్, రోహిత్, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.