29 April, 2026 | 3:25 AM

జిల్లాలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు

29-04-2026 01:31 AM

మెదక్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): జిల్లాలో సరిపడ పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని ఆర్డీవో రమాదేవి తెలిపారు. మంగళవారం మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ పంపును తహసిల్దార్ లక్ష్మణ్ బాబు తో పరిశీలించారు. అదే సమయంలో 12000 లీ. ఆయిల్ ట్యాంకర్ (8000-పెట్రోల్,4000-డీజిల్) రావడం జరిగినది.

ప్రస్తుత పెట్రోల్ నిల్వ : 29,232 లీ ఉన్నాయన్నారు. ప్రస్తుత డీజిల్ నిల్వ : 26,667 లీ. నిల్వ ఉన్నాయని, ప్రస్తుతం సరిపడా పెట్రోల్, డీజిల్ లభ్యత కలదు. కావున ఇట్టి విషయాన్ని వినియోగదారులు గమనించి కలత చెందే అవసరం లేదని కోరడం జరిగినది. అనంతరం మెదక్ మండలం రాజ్ పల్లి లోని PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగినది. గన్ని సంచుల వివరాలు, తాగునీటి సౌకర్యం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగినది. కాగా ఇప్పటి వరకు 1200 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని సిబ్బంది తెలిపారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు.