డీజీపీగా సీవీ ఆనంద్
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి
- 35 ఏళ్లుగా విశిష్ట సేవలు
- రేపు పదవీ విరమణ పొందనున్న ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): రాష్ట్ర కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణ యం తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సీవీ ఆనంద్ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు డీజీపీగా ప్రమోషన్ పొందారు.
ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ పొందనున్నారు. ఇటీవలే డీజీపీ పోస్టులకు అర్హులైన జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్పీ పంపించిన విషయం తెలిసిందే. ఇందులో సీవీ ఆనంద్ (1991 బ్యాచ్ )తోపాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ అప్టే, సౌమ్యమిశ్ర ఉన్నారు. ఈ ముగ్గురిలో అత్యం త సీనియర్ అయిన సీవీ ఆనంద్‌ను తెలంగాణ పోలీస్ బాస్‌గా ప్రభుత్వం నియమించింది.
ప్రస్తుతం ప్రభుత్వ హోంశాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో ఉన్న సీవీ ఆనంద్‌కు క్షేత్రస్థాయిలో పనిచేసిన సుదీర్ఘ అనుభం ఉన్నది. ప్రధానంగా శాంతిభద్రతల నిర్వహణలో ఆయనకున్న పట్టును ప్రభుత్వం పరిగ ణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. గతంలో హైదరాబాద్ సీపీగా, ఏసీబీ డీజీగా అవినీతి నిరోధక శాఖ లో సమూల మార్పులు తెచ్చారు.
గతంలో సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్‌గా రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో విజయవంతమయ్యారు. కేంద్ర సర్వీసుల్లో సీఐఎస్‌ఎఫ్ ఐజీగా కూడా పని చేశారు. ఆయన కనబర్చిన పనితీరుపై ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాంతిభద్రల బాధ్యతలను ఆనంద్‌కు అప్పగించడం ద్వారా శాఖలో మరింత క్రమశిక్షణ పెంచవచ్చని సర్కార్ భావించి బాధ్యతలు అప్పగించింది.
హైదరాబాద్‌లో పుట్టి..
హైదరాబాద్‌కు చెందిన సీవీ ఆనంద్.. పాతబస్తీలోని పెట్లబుర్జ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 1968 జూన్ 5న జన్మించారు. ఆయన తండ్రి దివంగత సీ దామోదర్‌రెడ్డి ఇండియన్ ఫారెస్టు సర్వీస్‌లో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పనిచేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన వీరి కుటుంబం హైదరాబాద్‌కు వల స వచ్చింది. విద్యారణ్య హైస్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట)లో విద్యా భ్యాసం పూర్తిచేసిన ఆనంద్, నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు.
ఆ తర్వాత ఉస్మాని యా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో మా స్టర్ ఆర్ట్స్ డిగ్రీకి గోల్డ్ మెడల్ సాధించారు. చదువుతోపాటు ఆండర్ జట్టు తరఫున క్రికెట్ ఆడి జాతీయస్థాయిలో రాణించారు. 1990లో సివిల్ సర్పీసెస్ పరీక్షకు హాజరై తన మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సా ధించి.. 147 స్థానంలో నిలిచారు. ఇండియన్ పోలీసు సర్వీసీ (ఐపీఎస్)ను ఎంచుకు న్న ఆయనకు ఆంధ్రప్రదేశ్ తన హోమ్ క్యాడర్‌ను కేటాయించింది.
1993లో వరంగల్ రూరల్ ఆదనపు ఎస్పీగా నియమితుల య్యారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా, నిజామాబాద్ జిల్లా ఎస్పీగా, కృష్ణా జిల్లా ఎస్పీగా, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా ఆఫ్ పోలీసుగా కూడా పనిచేశారు. నిబద్దత కలిగిన అధికారిగా సీవీ ఆనంద్ పలు గౌరవ పురస్కారాలు అందుకున్నారు.
2002లో ప్రెసిడెంట్ గ్యాలంట్రీ మెడల్, 2017లో ప్రెసిడెంట్స్ పోలీస్ మోడల్ వంటి వి ఆయన ప్రతిభకు నిదర్శనం. ఫిట్‌నెస్ పట్ల అత్యంత శ్రద్ధ వహించే సీవీ ఆనంద్, ఇప్పటికీ క్రికెట్, టెన్నిస్, గోల్ఫ్ వంటి క్రీడల్లో చురుకుగా పాల్గొంటారు. ఆయన కుమారుడు మిలింద్ ఆనందర్ ప్రొఫెషనల్ క్రికె టర్ కాగా, ప్రస్తుతం హైదరాబాద్ సీనియర్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నారు.






