calender_icon.png 14 May, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు సరిపడా ఉంచాలి: మంత్రి జూపల్లి

14-05-2025 01:01:02 AM

కొల్లాపూర్ మే 13:వరి కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం సరిపడా టార్పాలిన్ కవర్లు పంపిణీ చేసినప్పటికీ మార్కెట్ సిబ్బంది రైతులకు అందించడంలో అలసత్వం వహించడంపై రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళ వారం కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మిక తనిఖీ చేశారు.

మార్కెట్ యార్డు సెక్రటరీ విధుల పట్ల అలసత్వం వ్యవహరిస్తున్నారని, అవసరమైన సదుపాయాలు కల్పించడం లేదని మంత్రి రైతులు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, అక్కడి రైతులతో నేరుగా మాట్లాడారు.

తక్షణమే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ని ఆదేశించారు. ధాన్యం పరీక్షించి తూకం వేసి, ధరతో పాటు పూర్తి వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలని రైతులను అనవసరంగా ఇబ్బంది పెట్టే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.