calender_icon.png 14 May, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఐ పట్టించుకోలేదని బండరాయితో తలబాదుకున్న మహిళ!

14-05-2025 12:58:56 AM

పరిస్థితి విషమం జిల్లా ఆసుపత్రికి తరలింపు తాడూరు మండల కేంద్రంలో ఘటన

నాగర్ కర్నూల్ మే 13 (విజయక్రాంతి) తన సమస్యను పరిష్కరించలేదని నిరసిస్తూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ ముందే బండరాయితో తలబాదుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మే కల కావేరి రామకృష్ణలు బతుకుదెరువు కోసం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అద్దె ఇంట్లో ని వాసం ఉంటున్నారు. సెలవుల నేపథ్యంలో తిరిగి సొంత గ్రామంలో ఉంటున్నారు. గత రెండు రోజుల క్రితం తన భర్త ఫోన్ కి ఓ గుర్తుతెలియని వ్యక్తి నుండి అనుమానాస్పద ఫోన్ రావడంతో భార్యపై అనుమానం పెంచుకుని వేధించ సాగాడు.

దీంతో అనుమానత వ్యక్తి నెంబర్ పై తాడూరు మండల పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. తానిచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదని నిరసిస్తూ మంగళవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ ముందే బం డరాళ్లతో తలపై బాధ కొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వెంటనే జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

తలపై బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదే విషయంపై స్థానిక ఎస్త్స్ర గురు స్వామిని వివరణ కోరగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి అనుమానిత వ్యక్తికి ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలిపారు. అంతలోనే తన భర్త వేధింపుల కారణంగా మహిళ ఇలా చేసుకుని ఉంటుంది ఇందులో మా అలసత్వం ఏమి లేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.