17 April, 2026 | 8:56 AM

సరిపడా యూరియా నిల్వలు

30-12-2025 01:11 AM

-జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి యూరియా పంపిణీ ప్రారంభం

ఖమ్మం, డిసెంబర్ 29 (విజయ క్రాంతి): ఖమ్మం జిల్లాలో సరిపడా యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిసోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజులకు సంబంధించి 13 వేల 642 మెట్రి క్ టన్నుల యూరియా ఖమ్మం జిల్లాకు అవసరం ఉండగా, మనకు ఇప్పటి వరకు 9 వేల 407 మెట్రిక్ టన్నుల స్టాక్ వచ్చిందని, జిల్లాలో మరో 5 వేల 100 మెట్రిక్ టన్నుల స్టాక్ రిజర్వ్ ఉందని కలెక్టర్ తెలిపారు.

యూరియా సరఫరాలో ఎటువంటి కొరత లేదని తెలిపారు. ఖమ్మం జిల్లాలో యూరి యా బుకింగ్ యాప్‌వచ్చే వరకు ఆఫ్ లైన్ పద్ధతిలో రైతు పట్టాదారు పాస్ పుస్తకం పరిశీలించి యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలి పారు. రైతులు సాగు చేసే పంట స్వభావం అనుగుణంగా యూరియా సరఫరా చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో యూరి యాకు ఎటువంటి కొరత లేదని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ప్రతి కొనుగోలు కేంద్రం ద్వారా యూరియా అందిస్తున్నామ ని రైతులు ఆందోళన చెందకుండా అవసరమైన మేర యూరియా కొనుగోలు చేసి తీసుకుని వెళ్లాలని, అధికంగా కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.