28 August, 2026 | 1:57 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

రేషన్ షాపును సీజ్ చేసిన డిటి (సివిల్ సప్లై) మోబినోల్ల

05-04-2026 04:54 PM

దేవరకొండ (గుండ్లపల్లి),(విజయక్రాంతి): గుండ్లపల్లి మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి  గ్రామంలో గల రేషన్ షాపును దేవరకొండ డిటి (సివిల్ సప్లై) మోబినోల్ల ఆదివారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రేషన్ సరుకుల్లో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. రికార్డుల ప్రకారం ఉండాల్సిన నిల్వలకు, షాపులో ఉన్న సరుకులో తేడాలు ఉండటంతో నిబంధనల ఉల్లంఘన కింద అధికారులు సదరు రేషన్ షాపును సీజ్ చేశారు. అనంతరం డీలర్పై 6-ఏ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా  మోబినోల్ల హెచ్చరించారు.