calender_icon.png 9 July, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీ ఉంది

09-07-2025 01:28:29 PM

కేటీఆర్ కు అవగాహన లేదు

బిఆర్ఎస్ భూస్థాపితం ఖాయం: ఎమ్మెల్సీ శంకర్ నాయక్

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): ప్రజా సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీ ఉందని  దమ్ముంటే కెసిఆర్ ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని డిసిసి అధ్యక్షులు   ఎమ్మెల్సీ శంకర్ నాయక్  అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకుని తిని అధికారం కోల్పోయిన తర్వాత  కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దండుకు తిన్నారని కాలేశ్వరం కూలేశ్వరం అయిందని దుయ్యపట్టారు. నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా వివక్షత చూపారని, ఆంధ్రకు నీళ్లు ఇవ్వడానికి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్నది మీరు కాదా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రజల పార్టీ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.బనకచర్ల, కృష్ణ జలాలపై మాట్లాడాల్సింది అసెంబ్లీలో ప్రెస్ క్లబ్ లో కాదన్నారు. కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ హయంలో ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి అన్ని లీకేజీలు చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం  నిధులు కేటాయించిందని అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామంలో పేదలకు ఇండ్లు మంజూరు చేసిందని తెలిపారు. మతి భ్రమించి మాట్లాడుతున్న కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చూయించుకోవాలని త్వరలో తెలంగాణలో బిఆర్ఎస్ భూస్థాపితం ఖాయమన్నారు.