09-07-2025 01:23:05 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): 29 కార్మికుల చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్ లను అమలు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ బుధవారం భారత్ బంద్ కు కార్మిక అఖిల పక్ష జాతీయ సంఘాలు రాష్ట్ర సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. మోది ప్రభుత్యం ప్రవేశ పెడుతున్న కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఐఎన్ టీయూసి సలహా ధారు ,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోరం సురేందర్ నాయకత్వంలో కేఓసిలో ఓబి కార్మికులు స్వచ్చంధంగా ఉదయం మొదటి షిఫ్ట్ లొ సమ్మెలో పాల్గొన్నారు.
ఈ సమ్మెకు యూనియన్ అధ్యక్షులు ముచ్చా సుధాకర్ అధ్యక్షత వహిస్తూ మోది ప్రభుత్యం అమలు చేయాలను కుంటున్న 4 కార్మిక కోడ్ ల వలన, కార్మికులకు రావల్సిన కనీస వేతన చట్టం, బోనస్, ఈఎస్ ఐ, ఈపిఎఫ్, 8 గంటలు పని, రద్దు చేస్తూ మార్పులు చేస్తూ, 10 గంటలు పని, అమలు చేస్తూ వారంతపు సెలవులు కూడా లేకుండా కార్మిక హక్కులను పూర్తిగా హరిస్తూ కార్మికునికి తీవ్ర అన్యాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. మోది మొండి వైఖరి నషించాలని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ మాట్ల్లడారు.
ఈ సమ్మెకు భాధ్యత వహించి పిలుపు నిచ్చిన, సింగరేణి ఇల్లందు ఏరియా ఐఎన్ టీయూసి అధ్యక్ష , కార్యదర్శులకు, కొయగూడెం జనరల్ సెక్రటరీ, బ్రాంచ్ సెక్రటర్లకు, సహకరించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు కత్తుల వెంకటేశ్వర్లు, భూక్యా దసురు, సిహెచ్ రాజు, అంబాల చంద్రమౌళి, బాణోత్ సైదులు, గుగులోత్ శ్రీను, భానోత్ నరేష్(ఖాన), అజ్మీరా భద్రు, మహ్మద్, భూక్యా శ్రీను, బానోత్ శంకర్, గోపి, గణ్యా, ద్వాలియ, నరేష్, పవన్, అన్ని సెక్షన్ల కార్మికులు పాల్గొన్నారు.