09-07-2025 01:33:20 PM
దేవస్థానం అర్చక సిబ్బంది
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం దేవస్థానం(Bhadrachalam Devasthanam) కార్యనిర్వహణ అధికారి ఎల్.రమాదేవి(Bhadrachalam Temple Executive Officer Ramadevi) దేవస్థానం సిబ్బంది అర్చకులపై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేయటాన్ని భద్రాచలం పట్టణంలోని టీఎన్జీవో సంఘ నాయకులు బుధవారం దేవస్థానం రంగనాయకులు అర్చకులు తీవ్రంగా ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
భద్రాచలం పట్టణంలోని తానేష కళ్యాణ మండపం వద్ద గల దేవస్థానం కార్యాలయం ముందు దేవస్థాన ఉద్యోగులు ఉద్యోగ సంఘ నాయకులు అర్చకులు, విశ్రాంతి సంఘ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈవో పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, దేవస్థానం భూములను తిరిగి దేవస్థానం కి అప్పగించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆలయ భూములను పరిరక్షించడానికి వచ్చిన దేవస్థానం సిబ్బందిపై అభ్యంతరకరంగా మాట్లాడటమే కాకుండా దాడి చేయడాన్ని వారు తీవ్రంగా నిరసించారు. బాధ్యులపై ఏపీ ప్రభుత్వం, పోలీసు అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అలాగే భద్రాద్రి రామయ్య భూములలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు చోటుచేసుకోకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రామయ్య భూముల పరిరక్షణ కోసం దేవస్థానం అధికారులు సిబ్బంది చేస్తున్న చర్యలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని టిఎన్ జి ఓ డివిజన్ అధ్యక్షుడు కార్యదర్శులు డెక్క నరసింహారావు గగ్గూరి బాలకృష్ణలు స్పష్టం చేశారు.