09-07-2025 01:38:29 PM
సిఐటియు ఎఐటియుసి నాయకులు బుర్ర శ్రీనివాస్ గుగులోతు రాజారాం
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తున్న సిఐటియు ఏఐటీయూ నాయకులు బుర్ర శ్రీనివాస్, గుగులోతు రాజారాం మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతునివ్వడం దీని ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెనుకకు తీసుకోవాలని అన్నారు. 29 కార్మిక చట్టాల రద్దుచేసి నాలుగు లేబర్ కార్డులను ఏర్పాటు చేయడం వల్ల కార్మికుల యొక్క హక్కులను కాలు రాసినట్టేనని విమర్శించారు.
జీవో నెంబర్ 282 ను వెంటనే రద్దు చేయాలని కోరారు స్కీం వర్కర్లకు నెలకు 26000 కనీస వేతనం ఇవ్వాలని కోరారు రైతులకు మద్దతు ధర కల్పించాలని ఉపాధి హామీ కూలీలకు రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని అన్నారు. దేశాన్ని కాపాడే రాజ్యాంగాన్ని సవరించి హిందూ తత్వాన్ని పెంచే విధంగా బిజెపి కుట్రలు చేస్తుందని విమర్శించారు నిత్యావసర వస్తువుల ధరలను నివారించాలని దేశ సంపదను కొద్దిమంది కార్పొరేటర్లకు ఉపయోగపడే విధంగా కాకుండా ఈ దేశంలో ఉన్న 80 శాతం పేద మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడే విధంగా చూడాలని అన్నారు .