09-07-2025 01:40:09 PM
బీఆర్ఎస్ కంటే భిన్నంగా ప్రజాస్వామ్య పాలన
హైదరాబాద్: గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖి.. చాలా మంచి కార్యక్రమం అని వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) అన్నారు. మంత్రులను ప్రజలు నేరుగా కలిసి సమస్య చెప్పుకునే అవకాశం ఉండటం చాలా బాగుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా ప్రజా పాలన నడుస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా ప్రజాస్వామ్య పాలన నడుస్తోందని పేర్కొన్నారు. జిల్లాల్లో కూడా కలెక్టర్ల ప్రజా పాలనను సమర్థంగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. గ్యారంటీల అమలును పరిశీలించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అన్నారు.