calender_icon.png 19 October, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖత్రి సమాజ అధ్యక్షునిగా ఆదిత్య ఖండేష్కర్..

19-10-2025 06:43:22 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా సోమవంశీయ సహస్రర్జున క్షత్రియ(ఖత్రి) సమాజ్ అధ్యక్షునిగా ఆదిత్య ఖండేష్కర్, ప్రధాన కార్యదర్శిగా బండేవార్ రాజ్ శ్రీనివాస్ గెలుపొందారు. ఆదిలాబాద్ లోని సంఘ భవనంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నిలేష్ ఖత్రిపై 176 ఓట్ల అత్యధిక మెజార్టీతో ఆదిత్య ఖండేష్కర్ గెలుపొందారు. సమాజ్ లో మొత్తం 272 ఓటర్లు ఉండగా, నిలేష్ ఖత్రికి 54 ఓట్లు రాగా, ఆదిత్య ఖండేష్కర్ 230 ఓట్లు వచ్చాయి. సంఘం నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను పలువురు సమాజ్ సభ్యులు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఆదిత్య ఖండేష్కర్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని హమీ ఇచ్చారు. తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కసంఘం సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సమాజ్ సభ్యులు, కులస్తులు పాల్గొన్నారు.