19-10-2025 06:41:16 PM
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండల కేంద్రంలో గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా జనచైతన్య బైక్ యాత్రలో భాగంగా ఈరోజు వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో 25 వేల కిలోమీటర్లు పర్యటించి మరిపెడ మండల మున్సిపాలిటీ కేంద్రనికి బైక్ యాత్ర చేరుకున్న సందర్భంగా యువతను ప్రజలను జన చైతన్యం చేసి మత్తుపదార్థాలు మాదకద్రవ్యాలు తీసుకోవడంలో జరిగే అనార్థాలను వివరించడం జరిగింది. యువత ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ప్రణాళిక బద్ధంగా కష్టపడి లక్ష్యాన్ని సాధించాలని తల్లిదండ్రులకు గురువులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని యువతకు నో డ్రగ్స్ సేవ్ లైఫ్ అని ఈ సందర్భంగా జన చైతన్య బైక్ యాత్ర నిర్వాహకులు రాచకొండ ప్రభాకర్ టీచర్ సామాజిక కార్యకర్త సూర్యాపేట జిల్లా వాసి పిలుపునివ్వడం జరిగింది.