calender_icon.png 14 May, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ గురుకులాల్లో 17 వరకు అడ్మిషన్లు

12-05-2025 02:55:30 AM

  1. జూనియర్ ఇంటర్ ప్రవేశాల తేదీ పొడగింపు
  2. పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): బీసీ గురుకులాల్లో 2025 -26 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులకు ఈ నెల 17వరకు పొడగించామని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఆదివారం ప్రకటనలో తెలిపారు. లేదా /mjptbcwreis.cgg.gov. in/TSMJPBCWEB/లో అప్లు చేసుకోవాలని సూచించారు.

ప్రవేశ పరీ క్ష లేకుండా పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. జూనియ ర్ ఇంటర్‌లో రెగ్యులర్ గ్రూపులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీలతోపాటు వృత్తి విద్యా కోర్సులైన అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అం డ్ యనిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టె క్నాలజీ, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ కోర్సులు అందుబాటు లో ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 040-23328266 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.