calender_icon.png 14 May, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో బియ్యం, కూలర్లు అందజేసిన దోసపాటి రాము, సోదరులు

14-05-2025 07:26:44 PM

భద్రాచలం (విజయక్రాంతి): ఎస్కేటి సంస్థల డైరెక్టర్ దోసపాటి రాము జన్మదిన సందర్భంగా భద్రాచలంలోని కూనవరం రోడ్డులో గల సరోజినమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధుల కోసం బియ్యం అందజేశారు. ఆయన ఇటువంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఆయన జన్మదిన సందర్భంగా వృద్ధులు వేసవి తాపం వల్ల పడే ఇబ్బంది చూసి చెల్లించిపోయిన ఆయన సోదరులు వనమా సంపత్ కుమార్, కోదుమూరు శ్రీకాంత్, రేపాక రాంబాబు, కంచర్ల శ్రీనివాసులు, ఐడియా రవి రెండు కూలర్లు ఈ సందర్భంగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ కే టి డైరెక్టర్ దోసపాటి రాము, విపట్టణ ప్రముఖులు ప్రముఖ సంఘ సేవకులు గాదె మాధవ రెడ్డి, కంచర్ల శ్రీనివాస్, రేపాక రాంబాబు, రవి, వనమా సంపత్, ఎస్ కే టి స్టాఫ్ పాల్గొన్నారు.