14-05-2025 07:29:06 PM
కాటారం (విజయక్రాంతి): కాటారం మండల భూమాత రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉడుముల గురువారెడ్డి ఎన్నికైనారు. భూమాత రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సమ్మయ్య యాదవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మేకల దశరథం కాటారం మండల అధ్యక్షుడిగా చింతకాని గ్రామపంచాయతీలోని జగ్గయ్యపల్లె గ్రామానికి చెందిన ఉడుముల గురువారెడ్డిని నియమించారు. ఈ మేరకు బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉడుముల గురువారెడ్డి మాట్లాడుతూ... రైతు సంక్షేమ సంఘం కాటారం మండల అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సమ్మయ్య యాదవ్ కు, జిల్లా అధ్యక్షుడు మేకల దశరథంలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాటారం మండల రైతుల సంక్షేమం కోసం ఎల్లవేళలా తన వంతు కృషి చేస్తానన్నారు.