calender_icon.png 14 May, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి

14-05-2025 06:21:51 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..

తుంగతుర్తి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన కమిటీలు దోహదపడతాయని ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్, మండల, గ్రామ, వార్డు స్థాయి అధ్యక్ష పదవుల కోసం బుధవారం తుంగతుర్తిలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు టీపీసీసీ ఎన్నికల పరిశీలకుడు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్(MLA Murali Naik), జిల్లా పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు ఆధ్వర్యంలో దరఖాస్తులు అందజేశారు. అందజేసిన వారిలో గుండగాని మహేందర్ గౌడ్, రేగటి రవి, కలకోట్ల మల్లేష్, చింతకుంట్ల వెంకన్న, దొంగరి గోవర్ధన్ తదితరులు ఉన్నారు.