calender_icon.png 14 May, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ భవనాన్ని వినియోగంలోకి తేవాలి

14-05-2025 06:11:23 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు బుధవారం మండల తాహసీల్దార్ దయానందం(Mandal Tahsildar Dayanandam)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు తడకమళ్ళ రవికుమార్(BRS constituency leaders Tadakamalla Ravikumar) మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు పెళ్లిలు, శుభకార్యాలు, సభలు, సమావేశాలు పెట్టుకోవడానికి ఉపయోగకరంగా ఉంటదని కేసిఆర్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి ఒక కోటి రూపాయలు నిర్మించిన అంబేద్కర్ భవనని నిర్మించాలని తెలిపారు.

ప్రస్తుత తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు గెలిచిన నెల రోజులకే ఆయన పేరుతో శిలాఫలకం పెట్టుకొని ఆ భవనాన్ని ప్రారంభించి గాలికి వదిలేసారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భవనానికి విద్యుత్ సౌకర్యం, నీటి సదుపాయం, ప్రహరి గోడ నిర్మించి వెంటనే వినియోగంలోకి కోరారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మల్లేష్ బొజ్జ సాయికిరణ్ బొంకూరి మధు తడకమళ్ళ మల్లికార్జున్, బోయిని కొమరయ్య, పోతరాజు మహేష్, ఏపూరి మహేష్, కొండగడుపుల నాగరాజు తదితరులు పాల్గొన్నరు.