calender_icon.png 2 August, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోండి

14-05-2025 07:46:09 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ మైనారిటీ వసతి గృహ విద్యాసంస్థ(Government Minority Residential Educational Institution)ల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో మైనారిటీ విద్యాసంస్థలలో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లను అధికారులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... 2025–26 విద్యాసంవత్సరానికి గాను మైనారిటీ వసతి గృహాల్లో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. 6, 7, 8వ తరగతుల్లో పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మైనారిటీ వసతి గృహాల్లో అవసరమైన వసతులు, నాణ్యమైన బోధన, రుచికరమైన ఆహారం లభించనున్నాయని, విద్యా సంవత్సరానికి అవసరమయ్యే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.