calender_icon.png 14 May, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగుదేశం పార్టీ ఇల్లందు పట్టణ నూతన కమిటీ ఎన్నిక..

14-05-2025 07:17:43 PM

ఇల్లెందు టౌన్, (విజయక్రాంతి): ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని ఇల్లందు పట్టణం తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఇమామ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టణ అధ్యక్షునిగా పాలముల బాలకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులుగా దాసరి గోపాలకృష్ణ పట్టణ ప్రధాన కార్యదర్శిగా దేశావత్ శ్రీహరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ... తమపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీకి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని అన్నారు. నారా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం అవుతుందని తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరుగులేని పార్టీగా నిలిచిపోతుందన్నారు. ప్రతి కార్యకర్తను కలుపుకుపోయి ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తామని అన్నారు.