14-05-2025 07:41:26 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సిపిఐ మండల మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి(CPI Mandal Secretary Atmakuri Chiranjeevi) కోరారు. బుధవారం అసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధి సందీప్ నగర్ 1, 2 శాఖల మహాసభలను నిర్వహించారు. సందీప్ నగర్-1 శాఖ కార్యదర్శి తాల్లపెళ్లి దివాకర్, సందీప్ నగర్-2 శాఖ కార్యదర్శి గోనె గణేష్ జెండా ఆవిష్కరించి శాఖ సభలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ... భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలుగా పేద ప్రజల హక్కుల కోసం, భూమికోసం భుక్తి కోసం పోరాటం చేస్తున్నదన్నారు. ఈనెల 17న నిర్వహించే మహాసభల విజయవంతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు డోన్నాజీ, మండల కౌన్సిల్ సభ్యులు, శాఖ సభ్యులు సిద్దక్క, రాపర్తి భాస్కర్, మహేష్, సంతోష్, షబ్బీర్, సుధాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.