calender_icon.png 3 August, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

31 మందికి షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..

14-05-2025 07:37:40 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 31 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి(MLA Gaddam Vinod Venkataswamy) పంపిణీ చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం బెల్లంపల్లి మండలంలోనీ వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూ. 63,103,596/- లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  గడ్డం వినోద్ మాట్లాడుతూ... పేదింటి అమ్మాయి వివాహానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమిస్తారని, వారికి బాసటగా ఉండడానికి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ, ఎమ్మార్వో జోష్ణ, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.