చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి
జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం
మహబూబ్ నగర్, ఏఫ్రిల్ 30 (విజయ క్రాంతి) : పిల్లలు లేని వారు చట్టబద్ధమైన దత్తత తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉండవని జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం అన్నారు. గురువారం ప్రజా పాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో బాగంగా స్థానిక స్టేట్ హోం హాల్ లో దత్తత అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిడబ్ల్యుఓ మాట్లాడుతూ పిల్లలు లేని వారు ఒక సంతానం ఉన్న వారు పిల్లల కోసం కారా లో ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన దరఖాస్తుదారులకు కారా సీనియారిటీ ప్రకారం వంద శాతం దత్తత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆసుపత్రులు, ఇతర ప్రైవేటు వ్యక్తుల వద్ద నేరుగా దత్తత తీసుకోవడం చట్ట విరుద్దమని తెలిపారు. అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండ ఆ పిల్లలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం కొత్తగా కారా ద్వారా ఫోస్టర్ కేర్ విధానం తీసుకువచ్చిందని తెలిపారు. 8 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అర్హులైన చిన్నారులను రెండేళ్ల వరకు ఫోస్టర్ కేర్ ఇచ్చి, ఫోస్టర్ అడాప్షన్ గా మార్చుకునే అవకాశం కల్పిటచిందన్నారు. ఈ విధానంలోనూ చట్ట ప్రకారం అన్ని హక్కులు సంక్రమిస్తాయని పేర్కొన్నారు.
అనంతరం డ్రగ్స్ వినియోగం వల్ల అనార్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యుసి చైర్మన్ నయూమోద్దీన్, సిడిపిఓలు శైల శ్రీ, రాధిక, డిసిపిఓ నర్మద, చైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాములు, 1098 కోఆర్డినేటర్ శివ, శిశుగృహ స్టాఫ్ రామ్మోహన్, పద్మ, జగదీశ్వరి, అనిత తదితరులు పాల్గొన్నారు.






