1 August, 2026 | 1:56 AM

80 ఏండ్ల వృద్ధ అభ్యర్థులు 11 మంది

25-05-2024 01:31 AM

లోక్‌సభ అభ్యర్థుల వయసుపై ఏడీఆర్ విశ్లేషణ

25-30 మధ్య వయసువారు 537

41-60 ఏళ్ల వారే అధికం

8,337 మంది డాటా విశ్లేషణ

న్యూఢిల్లీ, మే 24: దేశంలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఐదు విడుతలు పూర్తయ్యాయి. నేడు ఆరో దశ పోలింగ్ జరగనుండగా జూన్ 1వ తేదీతో తుది దశ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వయసుకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) ఓ నివేదిక విడుదల చేసింది. అభ్యర్థుల్లో 11 మంది 80 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారని వెల్లడించింది. 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు 537 మంది ఉన్నట్లు తెలిపింది. లోక్‌సభకు పోటీ పడిన 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది డాటాను విశ్లేషించిన ఏడీఆర్ పలు విషయాలను ప్రచురించింది.